Srikanth into Semies:
భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు వరల్డ్ ఛాంపియన్ షిప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. స్పెయిన్ లో జరుగుతోన్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ లో నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి చైనీస్ తైపీ కి చెందిన తై జు యింగ్ చేతిలో 21-17, 21-13 తేడాతో ఓటమి పాలైంది. ఆట మొదటి నుంచీ తై యింగ్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొదటి సెట్ లో సింధు మధ్యలో హోరా హరీ తలపడినప్పటికీ తై జూ యింగ్ మళ్ళీ తేరుకొని సింధుపై పైచేయి సాధించింది.
పురుషుల సింగిల్స్ మ్యాచ్ లో కిడాంబి శ్రీకాంత్ 21-8; 21-7 తేడాతో నెదర్ల్యాండ్స్ ఆటగాడు మార్క్ కాల్జోవ్ పై ఘన విజయం సాధించాడు. శ్రీకాంత్ సొగసైన ఆటతో మార్క్ పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించాడు. ఏ దశలోనూ శ్రీకాంత్ కు పోటీ ఎదురు కాలేదు.