Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఆసియా బ్యాడ్మింటన్: సెమీస్ లో సింధు ఓటమి

ఆసియా బ్యాడ్మింటన్: సెమీస్ లో సింధు ఓటమి

Sindhu lost: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్స్-2022 టోర్నమెంట్ లో ఇండియా కథ ముగిసింది. బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సెమీఫైనల్లో ఓటమి పాలైంది. నేడు జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో ప్రత్యర్థి, జపాన్ కు చెందిన క్రీడాకారిణి అనేకా యమగుచి  చేతిలో 13-21; 21-19;21-16 తేడాతో  పారాజయం పాలైంది.  తొలి సెట్ ను అవలీలగా గెల్చుకున్న సింధు విజయంపై ఆశలు కలిగించింది. అయితే హోరాహోరీగా సాగిన రెండో సెట్ లో 21-19 తేడాతో కోల్పోవడంతో సింధు ఏకాగ్రత కోల్పోయినట్లు కలిపించింది. చివరి సెట్ లో సింధు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విజయం సాధించలేకపోయింది.

ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్ లో సింధు నాలుగో స్థానంలో కొనసాతుండగా… యమగుచి నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ తో కలిపి వీరిద్దరూ 22 సార్లు తలపడగా సింధు 13, యమగుచి 9 సార్లు విజయం సాధించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్