Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్INDONESIA OPEN 2023: సింధు, ప్రణయ్ గెలుపు

INDONESIA OPEN 2023: సింధు, ప్రణయ్ గెలుపు

జకార్తాలో నేడు మొదలైన బాడ్మింటన్  ఇండోనేషియా ఓపెన్-2023లో భారత షట్లర్లు పివి సింధు, హెచ్ ఎస్ ప్రణయ్, సాత్విక్-చిరాగ్ జోడీ తొలి రౌండ్ లో విజయం సాధించారు.

మహిళల సింగిల్స్ లో పివి సింధు 21-19;21-15తో ఇండోనేషియా ప్లేయర్ జార్జియా మరిష్క పై విజయం సాధించింది.

పురుషుల సింగిల్స్ లో హెచ్ ఎస్ ప్రణయ్ 21-16;21-14 తో జపాన్ ఆటగాడు కెంటా నిశిమోటో పై గెలుపొందాడు.

పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ 21-12; 11-7 తో ఫ్రాన్స్ జోడీపై విజయం సాధించారు.

కాగా మహిళల డబుల్స్ లో గాయత్రి గోపీ చంద్ -త్రెసా జాలీ జోడీ;  పురుషుల డబుల్స్ లో  ఎమ్మార్ అర్జున్- ధృవ్ కపిల; తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలై తొలి రౌండ్ లోనే నిష్క్రమించారు.

రేపు జరిగే తొలి రౌండ్ పోటీల్లో  లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రాజావత్, ఆకర్షి కాశ్యప్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్