Tuesday, September 17, 2024
Homeస్పోర్ట్స్Badminton Asia Championships 2023: సింధు, శ్రీకాంత్, ప్రణయ్ గెలుపు

Badminton Asia Championships 2023: సింధు, శ్రీకాంత్, ప్రణయ్ గెలుపు

దుబాయ్ లో జరుగుతోన్న బాడ్మింటన్ ఆసియా ఛాంపియన్ షిప్స్-2023లో భారత స్టార్ ఆటగాళ్ళు తొలి రౌండ్ లో విజయం సాధించారు.

  • పురుషుల సింగిల్స్ లో హెచ్ ఎస్ ప్రణయ్ 21-14; 21-9తో మనన్మార్ ఆటగాడిపై…. కిడాంబి శ్రీకాంత్ 21-13; 21-8తో బహ్రెయిన్  ప్లేయర్ పై గెలుపొందగా, లక్ష్య సేన్ ఓటమితో వెనుదిరిగాడు.
  • పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి 21-14;21-17తో మలేషియా జోడీపై గెలుపొందగా…. ధృవ్ కపిల-ఎమ్మార్ అర్జున్; కృష్ణ ప్రసాద్- విష్ణు వర్ధన్ గౌడ్; రవికృష్ణ-శంకర్ జోడీలు ఓటమి పాలయ్యారు.
  • మహిళల సింగిల్స్ లో పివి సింధు 21-15; 22-20తో తైవాన్ ప్లేయర్ వెన్ ఛి సు పై విజయం సాధించగా…. ఆకర్షి కాశ్యప్, మాళవిక బన్సోద్ లు నిష్క్రమించారు.
  • మహిళల డబుల్స్ లో గాయత్రి- త్రెసా జాలీ జోడీ 17-21; 21-17; 21-18 తేడాతో ఇండోనేషియా ద్వాయంపై విజయం సాధించగా…. హరిత-ఆష్నా; అశ్విని, శిఖా గౌతమ్ లు ఓటమి చెందారు.
  • మిక్స్డ్ డబుల్స్ లో రోషన్ కపూర్ – సిక్కి రెడ్డి జంట 21-12; 21-16తో మలేషియా జంటపై గెలుపొందింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్