Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్సెమీస్ కు సింధు, ప్రన్నోయ్, కిడాంబి

సెమీస్ కు సింధు, ప్రన్నోయ్, కిడాంబి

Swiss Open-2022: పివి సింధు, ప్రన్నోయ్, కిడాంబి శ్రీకాంత్ లు స్విస్ ఓపెన్ 2022 సెమీ ఫైనల్స్ కు చేరుకున్నారు.  పివి సింధు.21-10; 21-19తో కెనడా క్రీడాకారిణి మిచెల్లీ లీ ని ఓడించింది. హెచ్ ఎస్ ప్రన్నోయ్ మన దేశానికే చెందిన పారుపల్లి కాశ్యప్ పై 21-16, 21-16 తో గెలుపొందాడు.  కిడాంబి శ్రీకాంత్ 19-21; 21-19; 22-20 తేడాతో డెన్మార్క్ ఆటగాడు, వరల్డ్ నంబర్ టూ అండర్స్ అంటోన్సేన్ పై విజయం సాధించాడు.

ఇండోనేషియా ఆటగాడు అంటోనీ సినిసుకా గెంటింగ్ 21-17, 21-14 తేడాతో సమీర్ వర్మపై గెలుపొందాడు.  మహిళల డబుల్స్ లో అశ్విని పొన్నప్ప – సిక్కీ రెడ్డి జోడీపై ­22-20; 23-21తేడాతో మలేషియా జంట వివియన్ హూ –లిమ్ చ్యూ సియెన్ గెలుపొందారు.

Also Read : క్వార్టర్స్ లో కాశ్యప్ వర్సెస్ ప్రన్నోయ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్