Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం

పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం

బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్స్-2001 టోర్నీలో మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఏ’ మ్యాచ్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పి వి సింధు, పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’ మ్యాచ్ లో కిడంబి శ్రీకాంత్ విజయం సాధించారు. మహిళల డబుల్స్ గ్రూప్ ‘బి’ మ్యాచ్ లో అశ్వని పొన్నప్ప, సిక్కి రెడ్డి జోడీ ఓటమి పాలైంది.

ఇండోనేషియా లోని బాలిలో జరుగుతున్న ఈ టోర్నీలో మొత్తం ఏడుగురు ఆటగాళ్ళు భారత్ తరఫున పాతినిధ్యం వహిస్తుండడం విశేషం. మహిళల సింగిల్స్ లో సింధు, పురుషుల సింగిల్స్ లో కిడంబి శ్రీకాంత్, లక్ష్య సేన్…. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి; మగిలల డబుల్స్ లో సిక్కిరెడ్డి-పొన్నప్ప ఆడుతున్నారు.  నేటినుంచి మొదలైన ఈ టోర్నీ డిసెంబర్ ఐదు వరకూ జరగనుంది.

నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో సింధు డెన్మార్క్ కు చెందిన లైన్ క్రిస్టోఫియర్సన్ పై 21-14, 21-16 తేడాతోను, కిడంబి శ్రీకాంత్ ఫ్రాన్స్ ఆటగాడు తోమ జూనియర్ పోపోవ్ పై 21-14, 21-16 తేడాతో గెలిచారు.

పొన్నప్ప-సిక్కి రెడ్డి జోడీ జపాన్ కు చెందిన నామి మత్స్యు యమ-చిహారు షెడా చేతిలో 21-14, 21-18 తో ఓటమి పాలయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్