Saturday, June 13, 2026
Homeసినిమాకృష్ణ చైతన్య టైటిల్ రోల్ లో ‘ఘంటసాల ది గ్రేట్’

కృష్ణ చైతన్య టైటిల్ రోల్ లో ‘ఘంటసాల ది గ్రేట్’

అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. టైటిల్‌ పాత్రలో యువ గాయకుడు కృష్ణ చైతన్య, ఆయన భార్య సావిత్రి పాత్రలో మృదుల నటించారు. అన్యుక్తరామ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌‌ పతాకం పై శ్రీమతి ఫణి నిర్మాతగా, గాయకుడు జి.వి భాస్కర్‌ నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ‘ఘంటసాల పాటశాల’ సంకలన కర్త సి.హెచ్‌. రామారావు దర్శకత్వం వహించారు. షూటింగ్‌ తదితర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను ఫిల్మ్‌ చాంబర్‌లో ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ ఆవిష్కరించారు.

ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ… ‘‘ఘంటసాల అనగానే మనందరి ఒళ్లు పులకరిస్తుంది. మన నరనరాన ఆయన పేరు ఉండిపోయింది. అలాంటి గొప్ప వ్యక్తి కథతో, ఘంటసాల గారి మీద ఉన్న అభిమానంతో దర్శకుడు రామారావు ఈ ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నానికి నిర్మాతలు చక్కని సహకారం అందించారు. ఘంటసాల గారి మీద మనకున్న అభిమానాన్ని చూపించాలంటే ఈ సినిమాను సూపర్‌హిట్‌ చేయాలని ఫిల్మ్‌ ఇండస్ట్రీ తరఫున ప్రేక్షకులు అందరినీ కోరుతున్నా. టైటిల్‌ పాత్ర పోషించిన గాయకుడు కృష్ణ చైతన్యకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు.
ఘంటసాల పాత్రధారి కృష్ణచైతన్య మాట్లాడుతూ.. ‘‘ఘంటసాల పాత్ర పోషించడం ఓ గాయకుడిగా నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. ప్రపంచానికి ఆయన గాయకుడిగానే తెలుసు. ఆయన ఎదుగుదలలో ఎదురైన ఆటుపోట్లు, ఆయన గురించి తెలియని ఎన్నో విషయాలు ఎన్నో ఈ చిత్రంలో ఉన్నాయి’’ అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular