Thursday, March 12, 2026
Homeసినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా నుంచి ‘సిన్నవాడా..’ సాంగ్ రిలీజ్

 ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా నుంచి ‘సిన్నవాడా..’ సాంగ్ రిలీజ్

AVAK Song: ‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ నుంచి ‘పాగ‌ల్’ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్ పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 4న ఈ చిత్రం విడుదలవుతుంది. ఈరోజు సినిమా నుంచి ‘సిన్న‌వాడా ..’ అనే పాట విడుద‌లైంది.

పెళ్లి చూపుల‌కు వ‌చ్చిన అబ్బాయిలో తెలియ‌ని ఓ గంద‌ర‌గోళం, చిన్నపాటి ఆతృత ఉంటాయి. వాటిని గురించి ప్ర‌స్తావించేలా ‘సిన్నవాడా..’ సాంగ్ ఉంది. జాన‌ప‌దంలో సాగేలా పాట ఉండ‌టంతో పాట వింటుంటే డిఫ‌రెంట్‌గా అనిపిస్తూ ఆక‌ట్టుకుంటోంది. జై క్రిష్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రంలోని సిన్న‌వాడా పాట‌కు అనన్య భ‌ట్‌, గౌత‌మ్ భ‌ర‌ద్వాజ్ త‌మ గొంతుక‌ల‌తో ఓ కొత్తదనాన్ని అందించారు.

ఈ ఇంట్రెస్టింగ్‌.. ఎంట‌ర్‌టైనింగ్ చిత్రానికి.. సూప‌ర్ హిట్ మూవీ ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కథ – మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డం విశేషం. విద్యా సాగ‌ర్ చింతా చిత్రాన్ని తెర‌కెక్కించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.

Also Read : ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ లిరికల్ సాంగ్ రిలీజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular