Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్Asia Cup: చరిత్ర సృష్టించిన సిరాజ్

Asia Cup: చరిత్ర సృష్టించిన సిరాజ్

నేడు జరుగుతోన్న ఆసియా కప్ ఫైనల్లో హైదరాబాదీ పేసర్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టి శ్రీలంక బ్యాటింగ్ ను కకావికలం చేశాడు.

కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఇండియా-శ్రీలంక జట్ల మధ్య ఆసియ కప్ ఫైనల్ నేడు మొదలైంది. టాస్ గెలిచిన లంక బ్యాటింగ్ ఎంచుకుంది.  ఇండియా తరఫున బౌలింగ్ ప్రారంభించిన బుమ్రా మూడో బంతికే కుశాల్ పెరీరా ను డకౌట్ చేశాడు. ఒక ఫోర్, ఒక వైడ్ తో సహా ఏడు పరుగులు వచ్చాయి. రెండో ఓవర్ మొదలు పెట్టిన సిరాజ్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. మూడో ఓవర్లో బుమ్రా కేవలం ఒక్క పరుగుమాత్రమే ఇచ్చాడు.

నాలుగో ఓవర్లో అసలైన మ్యజిజ్ మొదలైంది. తొలి బంతికి పాథుమ్ నిశాంక (2)ను ఔట్ చేశాడు. మూడో బంతికి సదీర సమార విక్రమను ఎల్బీగా వెనక్కు పంపాడు. నాలుగో బంతికి చారిత్ ను డకౌట్ చేశాడు. ఆరో బంతికి ధనుంజయ డిసిల్వాను వెనక్కు పంపాడు. ఆ ఓవర్లో నాలుగు పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆరో ఓవర్లో కెప్టెన్ దాసున్ శనకను కూడా సిరాజ్ బౌల్డ్ చేసి డకౌట్ గా పెవిలియన్ పంపాడు.  12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది.

12వ ఓవర్లో సిరాజ్ కుశాల్ మెండీస్ ను కూడా బౌల్డ్ చేసి మొత్తం ఆరు వికెట్లు సాధించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్