Saturday, January 18, 2025
HomeTrending NewsBRICS: బ్రిక్స్‌ కూటమిలోకి మరో ఆరు దేశాలు

BRICS: బ్రిక్స్‌ కూటమిలోకి మరో ఆరు దేశాలు

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాలపై ఎక్కువగా ఆధారపడితే కష్టాలు తప్పవని ప్రపంచ దేశాలు తెలుసుకుంటున్నాయి. రష్యా ను వ్యతిరేకించకపోతే తమ నుంచి సాయం అందదని అమెరికా, నాటో దేశాలు మూడో ప్రపంచ దేశాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. దీంతో ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండంలో అనేక దేశాల్లో ఆహార కొరత ఏర్పడింది.

ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ దేశాలకు ఆశా కిరనంగా బ్రిక్స్ కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా బ్రిక్స్‌ కూటమి మరింత బలోపేతం కానుంది. బ్రిక్స్‌ గ్రూప్‌లో మరో ఆరు దేశాలు చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్ట్‌, యూఏఈ, ఇరాన్‌, సౌదీ అరేబియా, ఇథియోపియాలకు సభ్యత్వం ఇవ్వాలని దక్షిణాఫ్రికాలో జరిగిన సదస్సులో సభ్య దేశాలు నిర్ణయించాయి.

గురువారం సభ్య దేశాల నేతలు భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోస, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా ద సిల్వా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. 2024 జనవరి నుంచి నూతన దేశాలకు సభ్యత్వం లభిస్తుందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్