Sunday, June 14, 2026
Homeసినిమా'ఏజెంట్' బాటలో.. 'స్కంద' నిజమేనా..?

‘ఏజెంట్’ బాటలో.. ‘స్కంద’ నిజమేనా..?

ఇప్పడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరో అయినా యంగ్ హీరో అయినా.. ఎవర్నీ కదిపినా పాన్ ఇండియా మూవీ అంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. తొలి సినిమానే పాన్ ఇండియా సినిమా చేసేస్తున్నారు. అవును.. ఇటీవల బాగా ఫేమస్ అయిన యూట్యూబర్ హర్షసాయి సినిమాల్లోకి రావడం రావడమే పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించి సర్ ఫ్రైజ్ చేశాడు. అయితే.. పాన్ ఇండియా మోజులోపడి ప్లానింగ్ సరిగా చేయకపోవడంతో లాస్ట్ మినిట్ లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడం లేదు.. ఒక్క తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాం. ఆతర్వాత వేరే లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు.

‘ఏజెంట్’ విషయంలో అలాగే జరిగింది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. తీరా.. రిలీజ్ దగ్గరకి వచ్చేసరికి ముందుగా తెలుగులో రిలీజ్ చేస్తామని.. తర్వాత హిందీలో మిగిలిన భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. తెలుగులో డిజాస్టర్ అవ్వడంతో ఇక వేరే భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనను పక్కనపెట్టేశారు. ఇక అసలు విషయానికి వస్తే.. రామ్ నటించిన తాజా చిత్రం ‘స్కంద’. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను డైరెక్టర్. ఈ ఇద్దరి కాంబో మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.

అంతే కాకుండా.. ఈ సినిమాకి సంబంధించి టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేస్తే.. వాటిని తెలుగులోనే కాకుండా వేరే భాషల్లో కూడా రిలీజ్ చేశారు. అయితే.. ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇంకా 8 రోజులే టైమ్ ఉంది కానీ.. ఇంత వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ఈపాటికే తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రమోషన్స్ చేయాలి. జనాల్లోకి బాగా తీసుకెళ్లాలి.. అలా చేయకపోవడంతో లాస్ట్ మినిట్ లో ఒక్క తెలుగులోనే రిలీజ్ చేస్తున్నామని ప్రకటిస్తారా..? ఏజెంట్ బాటలో స్కంద నడిచేనా..? అనే అనుమానాలు వస్తున్నాయి. లేక సినిమానే వాయిదా వేస్తారా..? ఏం జరగనుందో అనేది ఆసక్తిగా మారింది. మరి.. స్కంద మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular