Sunday, June 7, 2026
Homeసినిమానవంబర్ 1న స‌త్య‌దేవ్‌‘ స్కైలాబ్‌’ ట్రైలర్ విడుదల

నవంబర్ 1న స‌త్య‌దేవ్‌‘ స్కైలాబ్‌’ ట్రైలర్ విడుదల

Skylab Trailer Will Be Released On November 1st :

స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా డా.రవికిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ సంయుక్తంగా విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్‌… 1979లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఈ మూవీ ట్రైల‌ర్‌ను న‌వంబ‌ర్ 1న విడుద‌ల చేస్తున్నారు. అలాగే సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

విశ్వక్ ఖండేరావు మాట్లాడుతూ “1979 సంవ‌త్సరంలో మన తెలుగు రాష్ట్రంలో బండ లింగపల్లి అనే గ్రామంలో కొన్ని విచిత్ర‌మైన ప‌రిస్థితులు జరిగాయి. అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ భూమి పై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి బిగపట్టి ఎదురుచూడసాగారు. వార్తాపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా కవర్‌ చేశాయి. ఈ నేప‌థ్యంలో ఆ గ్రామంలో ఉండే గౌరి, ఆనంద్‌, రామారావుల జీవితాల్లో స్కైలాబ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్ర‌య‌త్న‌మే ఈ చిత్రం” అన్నారు.

“ఇందులో ఆనంద్‌గా స‌త్య‌దేవ్‌, గౌరీగా నిత్యామీనన్,సుబేదార్ రామారావుగా రాహుల్ రామ‌కృష్ణ క‌నిపించ‌నున్నారు. వీరి పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్‌ ను విడుద‌ల చేశాం. ఆర్టిసులు స‌హా అద్భుత‌మైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు కుదిరారు. అనుకున్న ప్లానింగ్‌లోనే సినిమాను పూర్తి చేశాం. ఇప్పుడు సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మెసడోనియన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో సినిమాలో థీమ్స్‌ను రికార్డ్ చేయించాం. న‌వంబ‌ర్ 1న ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. త్వ‌ర‌లోనే సినిమాను థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాం” అని వెల్లడించారు.

Must Read : పవన్ సరసన నిత్యామీనన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular