సౌతాఫ్రికాతో జరుగుతోన్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. సిడ్నీలో మొదలైన ఈ మ్యాచ్ లో నిన్న మొదటి రోజు వర్షం, వెలుతురు లేమి కారణంగా 47 ఓవర్ల పాటు మాత్రమే ఆట జరిగిన విషయం తెలిసిందే. 2 వికెట్లకు 147 పరుగుల వద్ద నేడు రెండోరోజు మొదలు పెట్టిన ఆసీస్ లో… మూడో వికెట్ కు ఖవాజా- స్టీవెన్ స్మిత్ 209 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్మిత్ సెంచరీ (104) పూర్తయిన తరువాత ఔటయ్యాడు. ఖవాజా-ట్రావిస్ హెడ్ లు నాలుగో వికెట్ కు 112 పరుగులతో మరో చక్కని భాగస్వామ్యం నమోదు చేశారు. హెడ్ వేగంగా ఆడి 59 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్ తో 70 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఖవాజా 195; మాట్ రెన్ షా 5పరుగుల వద్ద ఉండగా టీ విరామ సమయంలో మరోసారి వర్షం ఆటంకం కలిగించడంతో రెండోరోజు ఆటను కూడా నిర్ణీత సమయం కంటే ముందే ముగించాల్సి వచ్చింది.
ఈరోజే తన కెరీర్ లో తొలి ద్వి శతకం పూర్తి చేయాలన్న ఖవాజా ఆశలు ఫలించలేదు.
నార్త్జ్ రెండు; రబడ, కేశవ్ మహారాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
Also Read : Aus Vs. SA: ఆస్ట్రేలియా 147/2