Snowy thunderstorms: భూతల స్వర్గంగా పేరున్న అమెరికాలో విలాసవంతమైన సౌకర్యాలు… ఆకాశమే హద్దుగా హంగు ఆర్భాటాలతో కూడిన జీవితం ఆక్కడ ఉన్నవారి సొంతం. ప్రపంచ దేశాల్లో ఏ రంగంలో కొత్త ఆవిష్కరణ జరిగినా అది అమెరికా ప్రజలకు అందుబాటులోకి రావలిసింది. ఇది నాణేనికి ఒకవైపు కనిపించే… ఆకర్షించే అంశం. మరోవైపు గన్ కల్చర్..దీంతో నెల ఒకసారి దేశంలో ఏదో ఓ మూల పక్క వారిని కాల్చి చంపటం… మానసిక ఒత్తిడితో దాడులు చేయటం వంటి ప్రమాదకర సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. దీనికి తోడు అననుకూల వాతావరణం. వర్షాలు పడినా…హిమపాతం పడినా విపరీతమే. ప్రకృతి ప్రకోపానికి అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు క్షణమొక యుగంగా కాలం వెళ్లదీస్తున్నారు.
ఈ క్రమంలో న్యూయార్క్ స్టేట్ లోని బఫెలో సిటీని గతంలో ఎన్నడూ లేని విధంగా పిడుగులతో కూడిన భారీ మంచు తుఫాను దిగ్బంధం చేసింది. రెండడుగుల మేర మంచు పేరుకు పోవడంతో వాహనాల రాకపోకలు నిల్చిపోయాయి. ఇది ఇంకా పెరిగి మరి కొద్ది రోజులు కొనసాగుతుందని యాక్యువెదర్ వాతావరణ సంస్థ తెలిపింది. విద్యుత్తు, మంచినీటి సరఫరాకు అంతరాయం కలగకుండా యంత్రాంగం నిర్విరామంగా పనిచేస్తోంది. విద్యుత్ సరఫరా నిలిచి పోతే అక్కడి ప్రజల జీవనం ఉహించుకోవటం కష్టం. కరెంటు పోతే ప్రతి ఇల్లూ ఒక శవ పేటిక అవుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
Also Read: అమెరికా అధ్యక్ష బరిలోకి మళ్ళీ ట్రంప్