Sunday, January 19, 2025
Homeసినిమాసంక్రాంతి పోటీకి మరికొన్ని సినిమాలు..?

సంక్రాంతి పోటీకి మరికొన్ని సినిమాలు..?

ప్రతి సంవత్సరం సంక్రాంతికి భారీ చిత్రాలు పోటీపడుతుంటాయి. రానున్న సంక్రాంతికి పోటీపడేందుకు ఇప్పటి నుంచే సినిమాలను రెడీ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకు మహేష్‌ బాబు ‘గుంటూరు కారం’, ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’, రవితేజ ‘ఈగల్’ చిత్రాలు సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అంటూ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు తేజ సజ్జ, ప్రశాంత్ వర్మల ‘హనుమాన్’ సినిమా కూడా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతుందని తెలిసింది. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి, కళ్యాణ్ కృష్ణతో ఓ భారీ చిత్రం చేయనున్నారు. ఇందులో సిద్దు జొన్నలగడ్డ కూడా నటిస్తున్నారు. చిరుకు జంటగా త్రిష, సిద్దు జొన్నలగడ్డకు జంటగా శ్రీలీల నటించనున్నారు.

మెగా డాటర్ సుస్మిత ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22న ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయనున్నారు. నాలుగు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలి అనుకుంటున్నారట. కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు చిత్రాలు సంక్రాంతికి వచ్చి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు చిరుతో మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమానే కాకుండా నాని 30వ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ.. డిసెంబర్ లో వెంకీ ‘సైంధవ్’ రిలీజ్ కానుంది. అందుచేత నాని సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలి అనుకుంటున్నారట. అలాగే విజయ్ దేవరకొండ, పరశురామ్ మూవీ ఇటీవల స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనేది దిల్ రాజు ప్లాన్. దీంతో సంక్రాంతికి ఏఏ సినిమాలు రానున్నాయి.? ఏ ఏ సినిమాలు పోటీ నుంచి తప్పుకోనున్నాయి..? అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి రానున్న సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర రసవత్తరమైన పోటీ ఏర్పడడం ఖాయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్