Saturday, July 27, 2024
Homeసినిమాఇప్పుడు కావలసింది కంటెంట్ .. అంతే!

ఇప్పుడు కావలసింది కంటెంట్ .. అంతే!

ప్రపంచవ్యాప్తంగా ప్రధానమైన వినోదసాధనంగా సినిమానే వర్ధిల్లుతోంది. ట్రెండ్ కి తగినట్టుగా సినిమా తనని తాను మార్చుకుంటూ ముందుకు వెళుతోంది. కథాకథనాల పరంగానే కాదు .. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. ఒక అసాధారణమైన లైన్ ను అనుకుంటే, దానిని సుసాధ్యం చేసి చూపించగలమనే ఒక ధైర్యం మేకర్స్ కి ఏర్పడింది. అందుకు కారణం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. అందువల్లనే ఒకప్పుడు తెరపై చేయలేని ప్రయోగాలు ఇప్పుడు ధైర్యంగా పట్టాలెక్కుతున్నాయి.

అయితే టెక్నాలజీ పరంగా తెరపై ఎలాంటి అద్భుతాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, దాని పునాదులు కథపైనే ఉంటాయి. కథలేకుండా చేసే సాహసాలు సక్సెస్ కాలేదు .. ప్రయోగాలు ఫలించలేదు. అందువలన ట్రెండ్ ఎంతగా మారినా కథ అనేది ఒకటి ఉండవలసిందే .. అది కొత్తగా .. బలంగా అనిపించవలసిందే. కేవలం విజువల్స్ కి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ కోట్లు గుమ్మరించిన సినిమాలు సైతం వీకెండ్ తరువాత థియేటర్స్ లో నిలబడటం లేదు. కథను నమ్ముకున్న సినిమాలు, అంతగా ప్రమోషన్స్ లేకపోయినా వసూళ్ల వర్షం కురిపించాయి.

దీనంతటికి కారణం ప్రేక్షకుల అభిరుచిలో మార్పు రావడమే. ఇప్పుడు ప్రేక్షకులకు కావలసింది స్టార్స్ కాదు .. వాళ్లు ఏ భాషకి చెందినవారు అనేది కాదు. కంటెంట్ .. కంటెంట్ అనేది ఉంటేనే థియేటర్స్ కి ఆడియన్స్ వస్తున్నారు. ఒకవేళ ఆ సినిమాలో మంచి కంటెంట్ ఉందని తెలియక థియేటర్స్ నుంచి వసూళ్లు తగ్గినా, ఆ సినిమాలు ఓటీటీ సెంటర్స్ ను ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఇటీవల వచ్చిన ‘విడుదల’ .. ‘2018’ .. ‘బలగం’ .. ‘రంగమార్తాండ’ సినిమాలను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందువలన సరైన కంటెంట్ ను పట్టుకుని సెట్స్ పైకి వెళ్లడమే కరెక్టు అనే అభిప్రాయానికి చాలామంది మేకర్స్ వచ్చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్