Sunday, January 19, 2025
HomeTrending Newsరెండు రాష్ట్రాల అంశాలకే పరిమితం: సోము

రెండు రాష్ట్రాల అంశాలకే పరిమితం: సోము

It is AP Issue: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసమే ఈనెల 17న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమావేశం ఏర్పాటు చేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు.  ప్రత్యేక హోదా అనేది పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన అంశమని…. ప్రత్యేక హోదాకు, తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని, అందుకే సమావేశ అజెండా నుంచి నుంచి హోదా అంశాన్ని తొలగించారని వీర్రాజు వివరించారు. అయితే ఆ సమావేశంలో హోదా అంశాన్ని ఏపీ ప్రత్యేకంగా ప్రస్తావించవచ్చని అయన సూచించారు.  ప్రత్యెక హోదా ఇవ్వాల్సింది కేంద్రం, అడగాల్సింది రాష్ట్రం అయినప్పుడు ఆ అంశానికి తెలంగాణతో ఏం సంబంధమని సోము ప్రశ్నించారు.

హోదా విషయంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందన్న వాదనను సోము తప్పు బట్టారు. గత ప్రభుత్వ హయాంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిందని, ఈ విషయమై చంద్రబాబు ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచిదని వీర్రాజు వివరించారు.

పెట్టుబడులు, అభివృద్ధి పథకాల విషయంలో కొన్ని రాయితీలు అడిగారని వాటికి సంబంధించి కేంద్రం కొన్ని నిధులు కూడా ఖర్చు చేసిందన్నారు. ప్యాకేజీ హామీని కొనసాగించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, దీన్ని రాబట్టుకునేందుకు గత ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రక్రియను ఈ ప్రభుత్వం కొనసాగించాల్సి ఉంటుందని అయన స్పష్టం చేశారు,

ఈనెల 17న కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో 10,368 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న 735 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టులకు సిఎం జగన్ తో కలిసి గడ్కరీ భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమం పై సోము వీర్రాజు బిజెపి నేతలు, కార్యకర్తలతో కలిసి చర్చించారు. గడ్కరీ పార్టీ కార్యక్రమంలో కూడా పాల్గొనే అవకాశం ఉంది.

Also Read : 17న రహదారి ప్రాజెక్టులకు శ్రీకారం: మంత్రి

RELATED ARTICLES

Most Popular

న్యూస్