Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్హిందువులకు భద్రత ఉందా

హిందువులకు భద్రత ఉందా

శ్రీశైలం దేవస్థానం షాపులను అన్యమతస్తులకు కేటాయించారని, ఇప్పుడు వారికి అక్కడే ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బిజెపి ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.  ప్రభుత్వం పెద్దల్లో వేళ్లూనుకుపోయిన హిందూ వ్యతిరేక భావజాలానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో హిందువులకు భద్రత ఉందా అని ప్రశ్నించారు.  పార్టీ నేతలతో కలిసి హిందూ దేవాలయాల సందర్శన యాత్ర భాగంగా నేడు శ్రీశైలంలో
శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్లను సోము వీర్రాజు బృందం దర్శించుకుంది, అనంతరం దేవాలయ ప్రాంగణంలో పలు షాపుల వద్దకు వెళ్లి వ్యాపారస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు వీర్రాజు.  రాష్ట్రంలో హిందూ దేవాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం నిర్లక్షం వహిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చారిత్రక సంపదను ప్రభుత్వం పరిరక్షించాలని సూచించారు.

గోవధ నిషేధ చట్టంపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలను సోము తీవ్రంగా ఖండించారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటే  ఇలాంటి చర్యలను అయన ప్రోత్సహిస్తున్నట్లు అర్ధమవుతోందని అన్నారు.  ఈ విషయమై వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని అయన హెచ్చరించారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి  పుష్పాంజలి ఘటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్