రామప్పకు గుర్తింపు హర్షణీయం

రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం గా గుర్తింపు  రావడం పట్ల తెలుగువాడిగా ఆనందిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని తమ్మినేని దర్శించుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పురాతన దేవాలయాలు ప్రాధాన్యతని గుర్తించాల్సిన అవసరం ఉందని అయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో మూడు రాజధానులు గురించి  ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశామని, దీనిపై ఎలాంటి రాద్ధాంతం అవసరం లేదని అయన  వ్యాఖ్యానించారు.

మహిళకు రక్షణ కవచంగా ఏర్పాటుచేసిన దిశ చట్టం సమర్ధంగా అమలు అవుతుందన్నారు. దిశ యాక్ట్ అమలు కాదు అని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆలోచన విధానం బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే అలా మాట్లాడగాలుగుతారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *