బిజెపి అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. బిజెపి-టిడిపి-తెలుగుదేశం కూటమిలో భాగంగా పది అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరిని విజయవాడ పశ్చిమ నుంచి, బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపింది. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కు మరోసారి కైకలూరు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. కాగా, బిజెపి సీనియర్ నేతలు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డిలకు నిరాశే ఎదురైంది. వారికి సీట్లు దక్కలేదు. అనపర్తి నుంచి సోమును పోటీ చేయించాలని కేంద్ర నాయకత్వం భావించినా అసెంబ్లీ సీటులో పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపలేదని తెలిసింది.
ఇక అసెంబ్లీ అభ్యర్ధుల విషయానికి వస్తే
- ఎచ్చెర్ల – ఎన్. ఈశ్వర్ రావు
- విశాఖపట్నం నార్త్ – విష్ణు కుమార్ రాజు
- అరకు వ్యాలీ ఎస్టీ – పంగి రాజారావు
- అనపర్తి – ఎం. శివ కృష్ణంరాజు
- కైకలూరు – కామినేని శ్రీనివాస్
- విజయవాడ పశ్చిమ – వైఎస్ (సుజన) చౌదరి
- బద్వేల్ ఎస్సీ- బొజ్జా రోషన్న
- జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి
- ఆదోని – పార్థ సారథి
- ధర్మవరం – వై. సత్యకుమార్