భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యఖ్సుడు సోము వీర్రాజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై పార్టీ జాతీయ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు, నిన్న విజయవాడ ప్రెస్ మీట్ సందర్భంగా బిజెపిపై పవన్ చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత చంద్రబాబు- పవన్ కళ్యాణ్ ల భేటీ పై కేంద్ర నాయకత్వానికి ఆయన నివేదిస్తున్నట్లు తెలిసింది.
విశాఖలో పవన్ కళ్యాణ్ ను నిలువరించడంపై బిజెపి ఏపి నేతలు కూడా స్పందించారు. మొన్న రాత్రి సోము వీర్రాజు స్వయంగా పవన్ తో విజయవాడ హోటల్ లో సమావేశమయ్యారు. ప్రభుత్వంపై రెండు పార్టీలు కలిసి పోరాటం చేస్తాయని ప్రకటించారు. ఆ మర్నాడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి-జనసేనలు కలిసి పని చేయాలని నిర్ణయించడంతో బిజెపి-జనసేన పొత్తు ప్రశ్నార్ధకమయ్యింది.
వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉండడంతో తాము ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనే అంశంపై జాతీయ నేతల మార్గదర్శనం కోసం వీర్రాజు ఢిల్లీ వెళ్ళినట్లు తెలిసింది.
Also Read : అధర్మంగా ధర్మాదాయ శాఖ: సోము

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.