Thursday, April 25, 2024
Homeసినిమాబాలయ్య మూవీ పై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ

బాలయ్య మూవీ పై క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ

బాలకృష్ణ ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ అనే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భారీ చిత్రంలో నటించనున్నారు. ఇందులో బాలయ్యకు ఓ కూతురు ఉంటుందని.. ఆ క్యారెక్టర్ లో శ్రీలీల నటించనుందని తెలిసింది. అయితే.. బాలయ్యకు జంటగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పేరు వినిపించింది.

డిసెంబర్ 8న ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి పేరు అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. ఆమె ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే.. ఇప్పుడు ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై సోనాక్షి స్పందించింది. ఇంతకీ ఈ అమ్మడు ఏమన్నదంటే… తెలుగు సినిమాలో నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ.. అందులో వాస్తవం లేదని చెప్పింది. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి మేకర్స్ ఎవరూ తనని కాంటాక్ట్ చేయలేదన్నారు. ఇకనైనా ఈ పుకార్లు ఆపండి అంటూ తనదైన స్టైల్ లో స్పందించింది.

దీంతో బాలయ్య మూవీలో సోనాక్షి నటించడం లేదని క్లారిటీ వచ్చింది. మరి.. అనిల్ రావిపూడి బాలయ్య కోసం ఏ హీరోయిన్ ని తీసుకువస్తారో అనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమా ఇప్పటి వరకు బాలయ్య చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని.. ఖచ్చితంగా ఓ కొత్త తరహా సినిమా చేశామనే సంతృప్తి ఆడియన్స్ కి కలిగిస్తుందని అనిల్ రావిపూడి గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తూ దూసుకెళుతున్నాడు. మరి.. బాలయ్యతో కూడా అనిల్ రావిపూడి సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్