అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 12 నుంచి ‘దహాద్’ వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. సోనాక్షి సిన్హా చేసిన ఫస్టు వెబ్ సిరీస్ ఇది. ఈ సినిమాలో ఆమె రాజస్థాన్ లోని ఓ ప్రాంతానికి చెందిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుంది. ఆమె పాత్ర పేరు అంజలి. ఈ కథలో ఎక్కువ భాగం రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లోనే నడుస్తుంది. ఆ ప్రాంతానికి చెందిన ఒక యువతి మిస్సింగ్ కేసు ఆ పోలీస్ స్టేషన్ కి వస్తుంది. ఆ కేసు విచారణను మొదలెట్టిన అంజలి ఆశ్చర్యపోతుంది.

ఎందుకంటే అప్పటికే  చాలామంది యువతులు మిస్సవుతారు. ఆ తరువాత వాళ్లంతా వరుసగా ఒకే పద్ధతిలో చనిపోతుంటారు. అవి ఆత్మహత్యలా? ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్న హత్యలా? అనేది అర్థంకాక పోలీస్ డిపార్టుమెంటువారు తలలు పట్టుకుంటారు. అంజలి ఈ విషయాన్ని సీరియస్ గా ఛేదిస్తూ ముందుకు వెళుతుంది. 27 మంది యువతుల మరణానికి కారకుడైనవాడు ఒక్కడే అనే నిర్ధారణకు వస్తుంది. అప్పుడు ఆమె ఆ నేరస్థుడిని పట్టుకోవడానికి ఎలాంటి పథక రచన చేస్తుందనే మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.

ఈ వెబ్ సిరీస్ లో చాలా పాత్రలు వస్తుంటాయి .. పోతుంటాయి. కానీ సోనాక్షి సిన్హా – విజయ్ వర్మ  పాత్రలు మాత్రమే ప్రధానమైనవిగా చెప్పుకోవాలి. ఇద్దరూ కూడా తమ పాత్రలలో జీవించారు. కథ .. స్క్రీన్ ప్లే .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ ఈ వెబ్ సిరీస్ ను నిలబెట్టాయి. అక్కడక్కడా కథ కాస్త బలహీనపడినప్పటికీ .. కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ, మొత్తంగా చూసుకుంటే ఓకే అనిపిస్తుంది. సోనాక్షి సిన్హా ఒక మంచి వెబ్ సిరీస్ తోనే ఎంట్రీ ఇచ్చిందనడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *