Wednesday, March 18, 2026
HomeTrending NewsSonia Gandhi : రాజకీయాల నుంచి సోనియాగాంధీ రిటైర్మెంట్

Sonia Gandhi : రాజకీయాల నుంచి సోనియాగాంధీ రిటైర్మెంట్

AICC కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. తన ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిసినందుకు సంతోషంగా ఉందన్న ఆమె.. ఇది పార్టీకి టర్నింగ్ పాయింట్ అని పేర్కొన్నారు. చ‌త్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్‌లో జ‌రుగుతున్న 3 రోజుల పార్టీ ప్లీనరీలో 1500మంది ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన సోనియా.. ఈ మేరకు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగియడం చాలా సంతోషాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఈ యాత్ర కాంగ్రెస్‌ పార్టీకి టర్నింగ్‌ పాయింట్‌ అయిందన్నారు. దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నారని భారత్‌ జోడో యాత్రగా రుజువైనట్లు సోనియా తెలిపారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సోనియా పిలుపునిచ్చారు

మనమంతా క్రమశిక్షణలో పనిచేద్దాం. గతంలో ఎన్నో ఎన్నికల్లో పార్టీ గెలిచిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. రాబోయే ఎన్నికలకు సిద్ధమవుదాం. పార్టీ గెలుపు అంటే దేశానికి విజయం కాకుండా మనలో ప్రతి ఒక్కరిది అని గుర్తుంచుకుందాం.” పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి సోనియా  అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఇది స‌వాళ్ల‌తో కూడుకున్న స‌మ‌యం అని సోనియా అన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్‌లు దేశంలో అన్ని సంస్థ‌ల్ని నిర్వీర్యం చేస్తున్నాయ‌ని ఆరోపించారు. కొంత మంది వ్యాపార‌వేత్త‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న‌ట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular