ఆర్సీబీ ఓపెనర్ సోఫీ డివైన్ విధ్వంసకర బ్యాటింగ్ తో గుజరాత్ పై బెంగుళూరు 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. సోఫీ 36 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 99 పరుగులు చేసి సెంచరీ ముంగిట ఔటయ్యింది. గుజరాత్ ఇచ్చిన 189 పరుగుల లక్ష్యాన్ని2 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఛేదించింది. తొలి వికెట్ కు కెప్టెన్ స్మృతి మందానా -సోఫీలు 125 పరుగులు జోడించారు. 31 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ తో 37 రన్స్ చేసి స్మృతి ఔట్ కాగా, ఎలీస్ పెర్రి-19; హిదర్ నైట్-22 పరుగులతో అజేయంగా నిలిచారు.
ముంబై బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వోల్వార్ద్ట్-68; ఆష్లీ గార్డ్ నర్-41; సబ్బినేని మేఘన-31; డంక్లీ-16; హేమలత-16; హర్లీన్ డియోల్-12 పరుగులతో రాణించడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి188 పరుగులు చేసింది. బెంగుళూరు బౌలర్లలో శ్రేయంకా పాటిల్ 2; సోఫీ డివైన్, ప్రీతీ బోస్ చెరో వికెట్ పడగొట్టారు.
సోఫీ డివైన్ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.