రంజీ ట్రోఫీ 2022-23ను సౌరాష్ట్ర కైవసం చేసుకుంది. 9 వికెట్ల తేడాతో బెంగాల్ పై ఘనవిజయం సాధించి రెండోసారి టైటిల్ విజేతగా నిలిచింది. జయ్ దేవ్ ఉనాడ్కత్ నేతృత్వంలోని సౌరాష్ట్ర జట్టు అద్భుతమైన ప్రతిభ కనబర్చి ప్రత్యర్థిపై మొదటినుంచీ ఆధిక్యం ప్రదర్శించింది. 4 వికెట్లకు 169 పరుగుల వద్ద నేడు నాలుగోరోజు ఆట మొదలు పెట్టిన బెంగాల్ రెండో ఇన్నింగ్స్ లో 241 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఉనాడ్కత్ 6; చేతన్ సకారియా 3 వికెట్లు పడగొట్టారు.
విజయానికి కేవలం 12 పరుగులే అవసరమైన సౌరాష్ట్ర ఒక వికెట్ కోల్పోయి లక్ష్యం సాధించి విజేతగా అవతరించింది.
బెంగాల్ తొలి ఇన్నింగ్స్ – 174 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ – 241 ఆలౌట్
సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ – 404 ఆలౌట్; రెండో ఇన్నింగ్స్ – 14/1
జయ్ దేవ్ ఉనాడ్కత్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’… అర్పిత్ వాసవాడ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ దక్కాయి