Friday, March 20, 2026
Homeస్పోర్ట్స్సౌతాఫ్రికాదే సిరీస్

సౌతాఫ్రికాదే సిరీస్

Cape Town Test: కేప్ టౌన్ టెస్టులో సౌతాఫ్రికా ఘనవిజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది. 212 పరుగుల విజయ లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి సాధించింది.  రెండు వికెట్ల నష్టానికి 101 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేటి ఆట మొదలు పెట్టిన సౌతాఫ్రికాలో కీగాన్ పీటర్సన్ 82 పరుగులు చేసి ఔటయ్యాడు. తెంబా బావుమా- 32, వాన్ డేర్ డస్సెన్-41 పరుగులతో అజేయంగా నిలిచారు.

ఇండియా బౌలర్లలో బుమ్రా, షమీ, శార్దూల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

మూడు టెస్టుల సిరీస్ ను  2-1తేడాతో సౌతాఫ్రికా గెల్చుకుంది.

కీగాన్ పీటర్సన్ ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ తో పాటు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ దక్కించుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular