Thursday, March 19, 2026
Homeస్పోర్ట్స్FIH Odisha Hockey: స్పెయిన్ చేతిలో మలేషియా సడెన్ డెత్

FIH Odisha Hockey: స్పెయిన్ చేతిలో మలేషియా సడెన్ డెత్

ఓడిశాలో జరుగుతోన్న పురుషుల హాకీ ప్రపంచకప్ టోర్నమెంట్, క్రాస్ ఓవర్స్ మ్యాచ్ ల్లో భాగంగా నేడు జరిగిన తొలి మ్యాచ్ లో మలేషియా పై  స్పెయిన్ షూటౌట్ విజయం సాధించింది.

ఓడిశా రాజధాని భుబనేశ్వర్ కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్  తొలి అర్ధ భాగంలో రెండు జట్లూ గోల్ చేయలేకపోయాయి. 35వ నిమిషంలో మలేషియా తొలి గోల్ చేసింది. 41,42 నిమిషాల్లో స్పెయిన్ రెండు గోల్స్ చేసింది. 49వ నిమిషంలో మలేషియా ఫీల్డ్ గోల్ చేసి స్కోరు సమం చేసింది, నిర్ణీత సమయంలోగా స్కోరు సమం కావడంతో షూటౌట్ కు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కూడా 3-3తో సమం అయ్యింది, దీనితో సడన్ డెత్ కు వెళ్ళగా అక్కడ స్పెయిన్ దే పైచేయి అయ్యింది.

స్పెయిన్ ఆటగాడు మార్క్ మిర్రాల్స్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular