Tuesday, June 9, 2026
Homeసినిమావిద్యార్ధుల కోసం 'మేజర్' ప్రత్యేక రాయితీ

విద్యార్ధుల కోసం ‘మేజర్’ ప్రత్యేక రాయితీ

Special Screening:  వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్‘. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకులు ఇండియన్ సినిమా చరిత్రలో ‘మేజర్’ చిత్రం ఒక మైలురాయని కితాబిచ్చారు. మేజర్ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి గొప్ప ఆదరణ వచ్చింది.

అలాగే స్కూల్ పిల్లలకు మేజర్ చిత్రం ఎంతగానో నచ్చింది. మేజర్ చిత్రం చూసిన విద్యార్ధులు చిత్ర యూనిట్ కు ప్రత్యేక సందేశాలు పంపిస్తున్నారు. ‘మేజర్ సందీప్ జీవితం తమకు ఎంతగానో ప్రేరణ కలిగించిదని తామూ మేజర్ సందీప్ లా ఆర్మీలో చేరి దేశం కోసం పోరాడతామని” విద్యార్ధులు, కథానాయకుడు అడివి శేష్ తో పాటు చిత్ర యూనిట్ కు సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపిస్తున్నారు. ఈ నేపధ్యంలో మేజర్ చిత్ర యూనిట్ స్కూల్ మేనేజ్మెంట్ కోసం ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ కి గ్రూప్ బుకింగ్స్ లో మేజర్ టికెట్ ధర 50 శాతం తగ్గించి చిత్రాన్ని ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని హీరో అడివి శేష్ ఒక ప్రత్యేక వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.

Also Read : మేజర్’ కు ‘పవర్’ ప్రశంశలు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular