Sunday, January 19, 2025
Homeసినిమా‘ఎఫ్ 3’ నుండి విక్టరీ వెంకటేష్ బ‌ర్త్‌ డే గ్లింప్స్

‘ఎఫ్ 3’ నుండి విక్టరీ వెంకటేష్ బ‌ర్త్‌ డే గ్లింప్స్

Glimpse for Victory:
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి ఈసారి మూడు రెట్ల వినోదాన్ని ఇచ్చేందుకు ‘ఎఫ్ 3’తో రాబోతున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్నారు. వెంకటేష్ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా నుంచి స్పెష‌ల్ పోస్ట‌ర్ తో పాటు బ‌ర్త్‌ డే గ్లింప్స్‌ ను విడుదల చేశారు. చార్మినార్ వాతావరణంలో నవాబులా డబ్బుని చేతిలో పట్టుకుని ఊపుతూ హాయిగా కనిపించారు. వెంకటేష్ తన మేనరిజంతో ఆకట్టుకున్నారు.

నటకిరిటీ రాజేంద్రప్రసాద్, సునీల్ లతో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు మూడో హీరోయిన్‌గా సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ‘ఎఫ్ 2’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. హైద్రాబాద్‌లో గత కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ సుధీర్ఘ షెడ్యూల్‌లో దాదాపు నటీనటులంతా కూడా పాల్గొంటున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను రెడీ చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

Also Read :  సక్సెస్ కి కేరాఫ్ అడ్రెస్…

RELATED ARTICLES

Most Popular

న్యూస్