Monday, February 24, 2025
HomeTrending NewsParliament: సెప్టెంబర్ లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

Parliament: సెప్టెంబర్ లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

కేంద్రంలోని ఎన్ డీ ఏ కూటమి ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 పని దినాలతో కూడిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు (17వ లోక్‌సభ 13వ సమావేశాలు, రాజ్యసభ 261వ సమావేశాలు) నిర్వహించబడనున్నాయి” అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి గల కారణాలపై అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ముందస్తుగా సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకు బిజెపి ప్రభుత్వం సిద్దం అవుతోందని బలంగా వినిపిస్తోంది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అత్యవసర బిల్లులను ఆమోదింప చేసుకుని…ఎన్నికలకు వెళతారని రాజకీయ వర్గాల్లో ఉహాగానాలు మొదలయ్యాయి. ఈ సమావేశాల్లోనే ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోద ముద్ర పడుతుందని కమలనాథులు అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్