Thursday, March 12, 2026
HomeTrending Newsస్పైస్‌జెట్‌ కు తప్పిన ప్రమాదం

స్పైస్‌జెట్‌ కు తప్పిన ప్రమాదం

స్పైస్‌జెట్‌ (SpiceJet) విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి కోజికోడ్‌ వస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం క్షేమంగా దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్పైస్‌జెట్‌కు చెందిన B737-8 మ్యాక్స్‌ విమానం ఆరుగురు సిబ్బందితో సహా 197 మంది ప్రయాణికులతో జెడ్డా నుంచి కోజికోడ్‌ వస్తున్నది. ఈ క్రమంలో విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తడంతో పైలట్‌.. విమానాశ్రయ సిబ్బందికి సమాచారం అందించాడు.

దీంతో కొచ్చి ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. ఈనేపథ్యంలో విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular