Sunday, February 23, 2025
HomeTrending Newsవిస్తరిస్తున్న ఓమిక్రాన్

విస్తరిస్తున్న ఓమిక్రాన్

Omicron Variant Spike : 

భారత్ లో రోజురోజుకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈరోజు ఉదయానికి భారత్ దేశంలో ఒమిక్రాన్ కేసుల 961కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 781 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 241మంది కోలుకోగా 268 మంది చనిపోయారు. కరోనా బాధితుల రికవరీ రేటు 98.38 గా ఉండటం ఉరట కలిగించే అంశం. అత్యధికంగా ఢిల్లీలో 263 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 252 కేరళలో 65, తెలంగాణలో 62, గుజరాత్‌లో 97, రాజస్థాన్‌లో 69, తమిళనాడులో 45, కర్నాటకలో 34, ఆంధ్రప్రదేశ్‌లో 16 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

దేశంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 9 వందలు దాటింది. మహారాష్ట్రలో పరిస్థితి క్రమంగా తీవ్రమవుతోంది. మహారాష్ట్ర సర్కార్‌. యూఏఈ, దుబాయి నుంచి వచ్చే ప్రయాణికులకు ఏడు రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి చేసింది. తెలంగాణ లోనూ రెండురోజులుగా కేసులు పెరుగుతున్నాయి. వచ్చే రెండు నుంచి నాలుగు వారాలు చాలా కీలకమని, ఇది మూడో వేవ్ ఆరంభానికి సూచిక అని తెలంగాణ వైద్యశాఖ హెచ్చరించింది. కేసులు త్వరలోనే భారీగా పెరిగే అవకాశాలున్నాయని, నూతన సంవత్సర వేడుకలు ఇంట్లోనే జరుపుకోవాలని తెలంగాణ వైద్యశాఖ సూచించింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్