Monday, March 16, 2026
Homeసినిమాఇండియన్ పనోరమాలో ‘స్రవంతి’ రవికిశోర్ ‘కిడ’

ఇండియన్ పనోరమాలో ‘స్రవంతి’ రవికిశోర్ ‘కిడ’

ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. గోవాలో ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఈ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ పనోరమాలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. థియేటర్లో  స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ‘కిడ’లో పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ సినిమాకు అరుదైన గౌరవం లభించడంతో ‘స్రవంతి’ రవికిశోర్ సంతోషం వ్యక్తం చేశారు.

రవికిశోర్ మాట్లాడుతూ “నేను చెన్నై వెళ్ళినప్పుడు ఓ స్నేహితుడిని కలిశా. తానొక కథ విన్నానని, అద్భుతంగా ఉందని చెప్పారు. కథ ఏంటి? అని అడిగా. ఐదు నిమిషాల పాటు కథ చెప్పారు. వినగానే కనెక్ట్ అయ్యాను. సరేనని స్క్రిప్ట్, డైరెక్టర్ నేరేషన్ వాయిస్ పంపించమని అడిగా. కథ మొత్తం విన్నాను. బావుంటుందని వెంటనే ఓకే చెప్పా. దర్శకుడికి తొలి సినిమా అయినా బాగా తీయగలడని, కథకు న్యాయం చేస్తాడనే నమ్మకంతో అతడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. అతడు స్క్రిప్ట్ ఏదైతే రాశాడో అదే తెర పైకి తీసుకొచ్చాడు. అందుకే, ఇవాళ ఇన్ని ప్రశంసలు లభిస్తున్నాయి. మా స్రవంతి సంస్థలో ఇది తొలి తమిళ సినిమా. సినిమాకు భాషాపరమైన ఎల్లలు, హద్దులు లేవు. మంచి సినిమా వస్తే సబ్ టైటిల్స్ తో కూడా చూస్తారు. అందుకనే, తమిళంలో తీశా. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular