ఐపీఎల్ ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్ లో హైదరాబాద్ ఓటమి పాలైంది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ 7 వికెట్లతో పరాజయం పాలై ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకుంది. హైదరాబాద్ ఇచ్చిన 183 పరుగుల విజయ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్నో సాధించింది. నికోలస్ పూరన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 44; ప్రేరక్ మన్కడ్ 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలోకీలక పాత్ర పోషించారు.
ఉప్పల్ స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హెన్రిచ్ క్లాసేన్-47; అబ్దుల్ సమద్-37(నాటౌట్); అన్మోల్ ప్రీత్ సింగ్-36; ఏడెన్ మార్ క్రమ్-28; రాహుల్ త్రిపాఠి-20 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేయగలిగింది. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 2; యుద్వీర్ సింగ్, అమిత్ మిశ్రా, యష్ ఠాకూర్, ఆవేష్ ఖాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ప్రేరక్ మన్కడ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.