Saturday, March 14, 2026
Homeస్పోర్ట్స్IPL: సన్ రైజర్స్ కు మూడో ఓటమి:  ముంబై గెలుపు

IPL: సన్ రైజర్స్ కు మూడో ఓటమి:  ముంబై గెలుపు

మొదట రెండు పరాజయాలతో డీలా పడి, తర్వాత రెండు విజయాలతో నిలదొక్కుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కు  మళ్ళీ ఓటమి ఎదురైంది. ముంబై ఇండియన్స్ తో సొంత గడ్డపై నేడు జరిగిన మ్యాచ్ లో 14 పరుగులతో ఓటమి పాలైంది. టాపార్డర్ విఫలం కావడంతో 193 పరుగుల విజయ లక్ష్యం చేరుకోలేక 19.5 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. కామెరూన్ గ్రీన్ 40 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 64; ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 3 ఫోర్లు  2 సిక్సర్లతో 38; తిలక్ వర్మ   17 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 37; కెప్టెన్ రోహిత్ శర్మ 18 బంతుల్లో 6ఫోర్లతో 28;  టిమ్ డేవిడ్-16 పరుగులతో సత్తా చాటారు. నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్లకు 192 స్కోరు చేసింది. కాగా, సూర్య కుమార్ యాదవ్ (7)మరోసారి విఫలమయ్యాడు.

హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సెన్ 2; భువీ, నటరాజన్ చెరో వికెట్ పడగొట్టారు.

హైదరాబాద్ 25 పరుగులకే రెండు వికెట్లు (హ్యారీ బ్రూక్-9; రాహుల్ త్రిపాఠి-7) కోల్పోయింది, మయాంక్ అగర్వాల్-48; హేన్రిచ్ క్లాసేన్-36; ఏడెన్ మార్ క్రమ్-22; మార్కో జన్సేన్-13; వాషింగ్టన్ సుందర్-10 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ (1) విఫలమయ్యాడు.  అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుదర్ రనౌట్ లు హైదరాబాద్ గెలుపుపై ప్రభావం చూపించాయి.

ముంబై బౌలర్లలో బెహెండ్రాఫ్, మెరెడిత్ చెరో రెండు; కామెరూన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్ చెరో వికెట్ పడగొట్టారు.

కామెరూన్ గ్రీన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్క్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular