Saturday, January 18, 2025
Homeసినిమాబ‌న్నీతో శ‌ర్వా డైరెక్ట‌ర్ మూవీ?

బ‌న్నీతో శ‌ర్వా డైరెక్ట‌ర్ మూవీ?

హీరో శర్వానంద్ చాలా సంవత్సరాలుగా సక్సెస్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ.. ఆశించిన హిట్ దక్కలేదు.  శ్రీకార్తిక్ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందిన ‘ఒకే ఒక జీవితం‘ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే ప్రేక్ష‌కుల‌ను మెప్పించి కమర్షియల్ గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఈ చిత్ర దర్శకుడు శ్రీకార్తీక్  పేరు టాలీవుడ్, కోలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. యంగ్ హీరోలు ఈయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈయన మాత్రం ఇప్పటికే తన రెండవ తెలుగు సినిమాను ఫిక్స్ చేసుకున్నాడట. అల్లు అర్జున్ తో ఈ తమిళ దర్శకుడు తన రెండవ సినిమాను చేయాలనుకుంటున్నాడు. అల్లు అర్జున్ కోసం ఒక ఫాంటసీ రియలిజం సినిమా కథను రెడీ చేసినట్లు శ్రీకార్తిక్ చెప్పుకొచ్చాడు.

త్వరలోనే తన వద్ద ఉన్న ఫాంటసీ రియలిజం కథను అల్లు అర్జున్ కి వినిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా శ్రీకార్తీక్ చెప్పాడు. అయితే.. బ‌న్నీని క‌థ‌తో మెప్పించినా.. సెట్స్ పైకి వెళ్ల‌డానికి చాలా టైమ్ పడుతుంది. ఎందుకంటే.. పుష్ప 2 కాకుండా బోయ‌పాటి, కొర‌టాల‌తో సినిమాలు చేసేందుకు బ‌న్నీ ఓకే చెప్పారు. మ‌రి.. బ‌న్నీ కోసం శ్రీకార్తీక్ వెయిట్ చేస్తాడో.. మ‌రో హీరోతో సినిమా చేస్తాడో చూడాలి.

Also Read : ఇది నా సినిమా అని జీవితాంతం చెప్పుకునేలా ఉంటుంది: శర్వానంద్

RELATED ARTICLES

Most Popular

న్యూస్