Tuesday, February 25, 2025
Homeస్పోర్ట్స్SL Vs. IRE: శ్రీలంక క్లీన్ స్వీప్

SL Vs. IRE: శ్రీలంక క్లీన్ స్వీప్

ఐర్లాండ్ తో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేసింది. నేడు ముగిసిన రెండో టెస్టును ఇన్నింగ్స్, 10 పరుగుల తేడాతో గెల్చుకుంది. నిన్న నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో ఐర్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసి అప్పటికి ఇంకా 158 పరుగులు వెనకబడి ఉంది.

నేడు చివరి రోజు విజయం కోసం ఆతిథ్య శ్రీలంకకు 8 వికెట్లు  అవసరం కాగా  ఐర్లాండ్ బ్యాట్స్ మన్ హ్యారీ టెక్టార్- కెప్టెన్ అండ్రూ బాల్బిర్నీ డ్రా కోసం ప్రత్నించినా సాధ్యపడలేదు. బాల్బిర్నీ 46; టెక్టార్ 85 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్ లో ఐర్లాండ్ 202 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లంక బౌలర్ రమేష్ మెండీస్ ఐదు వికెట్లతో రాణించాడు. అసిత ఫెర్నాండో 3; ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు సాధించారు.

ప్రభాత్ జయసూర్య ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’; కుశాల్ మెండీస్ ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ గెల్చుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్