Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ICC WC Qualifiers: లంక చేతిలో ఒమన్ చిత్తు

ICC WC Qualifiers: లంక చేతిలో ఒమన్ చిత్తు

ఐసిసి వరల్డ్ కప్-2023 క్వాలిఫైర్స్ టోర్నీ లో ఒమన్ పై శ్రీలంక 10 వికెట్లతో ఏకపక్ష విజయం సాధించింది.  లంక బౌలర్ వానిందు హసరంగ మరోసారి ఐదు వికెట్లతో సత్తా చాటగా, లాహిరు కుమార 3, రజిత 1 వికెట్ సాదించారు. దీనితో ఒమన్ 30.2 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని లంక వికెట్ నష్టపోకుండా 15 ఓవర్లలోనే సాధించింది.

బులావాయో లోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో జరిగిన నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన లంక బౌలింగ్ ఎంచుకుంది. జట్టులో అయాన్ ఖాన్-41; జితేందర్ సింగ్-21; ఫయ్యజ్ భట్-13 మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. దీనితో 98 పరుగులకే కుప్పకూలింది.

లంక ఓపెనర్లు పాథుమ్ నిశాంక-37; దిముత్ కరుణరత్నే-61(51 బంతుల్లో 8 ఫోర్లు) పరుగులతో అజేయంగా నిలిచి ఘన విజయం అందించారు.

హసరంగ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్