Thursday, September 19, 2024
Homeస్పోర్ట్స్Asia Cup: చివరి బంతికి విజయం- ఫైనల్లో లంక

Asia Cup: చివరి బంతికి విజయం- ఫైనల్లో లంక

శ్రీలంక జట్టు ఆసియా కప్ క్రికెట్ ఫైనల్స్ కు చేరుకుంది. కొలంబో లోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో చివరి బంతి వరకూ నరాలు తెగిపోయే  ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్ లో లంక 2 వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంద. చివరి రెండు ఓవర్లూ విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. లంక బ్యాట్స్ మెన్ అసలంక చివరి బంతికి రెండు పరుగులు కావాల్సిన దశలో గల్లీ మీదుగా బౌండరీ లైన్ వైపు తరలించి అద్భుత విజయం అందించాడు,

వర్షం కారణంగా మ్యాచ్ ను 42 ఓవర్లకు కుదించారు. పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రిజ్వాన్ 73 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 86 (నాటౌట్);  ఓపెనర్ షఫీఖ్ 52;  ఇఫ్తికార్ అహ్మద్ 40 బంతుల్లో  4 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులతో రాణించారు. నిర్దేశించిన 42 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. లంక బౌలర్లు మతీష పథిరణ 3; ప్రమోద్ మధుశాన్ 2; తీక్షణ, వెల్లిగెలే చెరో వికెట్ పడగొట్టారు.

శ్రీలంక 77 పరుగులకు 2 వికెట్లు (కుశాల్ పెరీరా 17; పాథుమ్ నిశాంక 29) కోల్పోయింది. కుశాల్ మెండీస్- సదీర సమారవిక్రమ లు మూడో వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సదీర 48 రన్స్ సాధించి ఇఫ్తికార్ బౌలింగ్ లో స్టంప్ ఔటగా వెనుదిరిగాడు. కుశాల్ 87 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో 91 పరుగులు చేసి నెర్వస్ నైంటీస్ తో సెంచరీ చేజార్చుకున్నాడు. 41వ ఓవర్లో షహీన్ ఆఫ్రిది కేవలం 4 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టడంతో లంక శిబిరం డీలాపడింది. చివరి ఓవర్లో ప్రమోద్ రనౌట్ అయ్యాడు. చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో అసలంక ఒక ఫోర్ కొట్టాడు. చివరి బంతికి మూడు పరుగులు చేయడంతో శ్రీలంక విజయం సొంతం చేసుకుంది.

పాక్ బౌలర్లలో ఇఫ్తికార్ అహ్మద్ 3; షాహీన్ ఆఫ్రిది 2; షాదాబ్ ఖాన్ 1 వికెట్ సాధించారు.

కుశాల్ మెండీస్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్