Thursday, March 12, 2026
Homeస్పోర్ట్స్SL Vs. IRE: లంక ధీటైన జవాబు

SL Vs. IRE: లంక ధీటైన జవాబు

ఐర్లాండ్ తో జరుగుతోన్న తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక ధీటుగా జవాబిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో నిన్న రెండోరోజు వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసిన లంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 357 పరుగులు చేసింది. కరుణరత్నే115 పరుగులు చేసి ఔట్ కాగా, నిషాన్ మధుష్క 149 (18 ఫోర్లు, 1 సిక్సర్);  కుశాల్ మెండీస్ 83 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ జట్టు లంకలో పర్యటిస్తోంది. మొదటి టెస్టును లంక ఇన్నింగ్స్, 280 పరుగులతో గెల్చుకుంది. రెండో టెస్ట్ మొన్న ఏప్రిల్ 24న మొదలైంది. ఐర్లాండ్ ప్లేయర్స్ స్టిర్లింగ్-103; కాంఫర్-111; కెప్టెన్ బాల్బిర్నీ-95 పరుగులతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో 492 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  లంక బౌలర్ ప్రభాత్ జయసూర్య 5 వికెట్లు సాధించగా, విశ్వ ఫెర్నాండో, అషిత ఫెంరాందో చెరో రెండు, మెండీస్ ఒక వికెట్ పడగొట్టారు.

మూడోరోజు ఆట ముగిసే సమయానికి లంక తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 135 పరుగులు వెనకబడి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular