Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్రెండో మ్యాచ్ లో శ్రీలంక గెలుపు

రెండో మ్యాచ్ లో శ్రీలంక గెలుపు

మూడు వన్డేల టి-20 మ్యాచ్ ల్లో భాగంగా రెండో మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించి ­ సిరీస్ ను 1-1 తో సమం చేసింది. సిరీస్ విజేతను నిర్ణయించే కీలకమైన మూడో మ్యాచ్ నేడు జరగనుంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దాసన్ శనక బౌలింగ్ ఎంచుకున్నారు. ఇండియా జట్టులో రుతురాజ్ గైక్వాడ్, నితీష్ రానా, చేతన్ సకారియా, దేవదత్ పదిక్కల్ లు ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టారు.

కృనాల్ పాండ్యా కు కోవిడ్ సోకడంతో మంగళవారం జరగాల్సిన మ్యాచ్ బుధవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే, కృనాల్ తో పాటు  పాటు అతనికి సన్నిహితంగా ఉన్న ఏడుగురు ఆటగాళ్ళు హార్ధిక్ పాండ్యా, పృథ్వీ షా, సూర్య కుమార్ యాదవ్, మనీష్ పాండే, దీపక్ చాహర్, ఇషాన్ కిషన్, గౌతమ్ లను కూడా హోటల్ రూమ్ కే పరిమితం చేశారు. యజువేంద్ర చాహల్ కు విశ్రాంతి ఇచ్చారు.

కెప్టెన్ ధావన్ తో కలిసి రుతురాజ్ గైక్వాడ్ ఇండియా ఇన్నింగ్స్ ఆరంభించాడు. తొలి వికెట్ కు 49 పరుగుల భాగస్వామ్యం వద్ద 18 బంతుల్లో 21 పరుగులు చేసిన గైక్వాడ్ ఔట్ అయ్యాడు.  ధావన్ 42 బంతుల్లో  5 ఫోర్లతో 40 పరుగులు సాధించాడు. దేవదత్ పడిక్కల్ 23బంతుల్లో  1ఫోర్, 1సిక్సర్ తో  29 పరుగులు సాధించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.

133 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన శ్రీలంక జట్టులో   ఓపెనర్- వికెట్ కీపర్ మినోద్ భానుక 31 బంతుల్లో  4 ఫోర్లతో 36; ధనుంజయ డిసిల్వా 34 బంతుల్లో 1ఫోర్  1సిక్సర్ తో 40 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ధనుంజయ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్