Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్చివరి మ్యాచ్ లో శ్రీలంక గెలుపు

చివరి మ్యాచ్ లో శ్రీలంక గెలుపు

Lanka Won: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టి20లో శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక ఓపెనర్ కుశాల్ మెండీస్ 69 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ కోసం లంక జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలుచుకోవడంతో పాటు సిరీస్ ను కూడా ఆస్ట్రేలియా గెల్చుకుంది. చివరి మ్యాచ్ నేడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగింది.

ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది, 12  పరుగులకే ఓపెనర్లు కెప్టెన్ పించ్ (8); బెన్ మెక్ డిమోట్(3) పెవిలియన్ చేరారు. వికెట్ కీపర్ వేడ్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 43; జోష్ ఇంగ్లిస్-23; మాక్స్ వెల్-29; స్టోనిస్-17 రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేయగలిగింది. లాహిరు కుమార, చమీర చెరో రెండు; జయ విక్రమ, కరుణ రత్నే చెరో వికెట్ పడగొట్టారు.

155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కూడా 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. పాథుమ్ నిశాంక-13; కామిల్ మిశార-1 చేసి ఔటయ్యారు. చరిత్ అసలంక-20 తో రాణించినా జనిత్ లియనాగే 8 పరుగులకే ఔటయ్యాడు. ఈ దశలో మెండీస్, కెప్టెన్ శనుక ఐదో వికెట్ కు 81పరుగుల భావస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ ను గాడిలోపెట్టి విజయ తీరం వైపు నడిపించారు. శనుక 31 బంతుల్లో 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. మెండీస్ 58 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ తో 69  పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 19.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కేన్ రిచర్డ్సన్ రెండు, అష్టన్ అగర్ ఒక వికెట్ పడగొట్టారు.

శ్రీలంక గెలుపులో కీలక పాత్ర పోషించిన మెండీస్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’; సిరీస్ లో రాణించిన ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్  మాక్స్ వెల్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’  లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్