Monday, June 15, 2026
Homeసినిమావందశాతం ఎంజాయ్ చేసే సినిమా భాగ్ సాలే - శ్రీసింహా

వందశాతం ఎంజాయ్ చేసే సినిమా భాగ్ సాలే – శ్రీసింహా

శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన కొత్త సినిమా ‘భాగ్ సాలే’. ఇందులో నేహా సోలంకి నాయికగా నటించింది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాతగా.. బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల సంయుక్తంగా నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది.

హీరో శ్రీసింహా మాట్లాడుతూ.. భాగ్‌ సాలే సినిమాను చూసి ప్రేక్షకులు రెండు గంటలపాటు హాయిగా నవ్వుకోవచ్చు. లాజిక్‌లు, పెద్ద పెద్ద ఎమోషన్స్ పక్కనపెట్టేసి ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో సంతోషంగా నవ్వుకునే విధంగా సినిమా ఉంటుంది. సాలే అంటే బూతు పదం కాదు. క్యాచీగా ఉంటుందని పెట్టాం. సినిమా అంతా రింగ్ చుట్టే తిరుగుతుంది. హైద్రాబాద్‌లో షూటింగ్ చేశాం. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాం. ప్రేక్షకులు వంద శాతం ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ప్రివ్యూ షోలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కథ రాస్తున్నప్పుడే చాలా నమ్మకంతో ఉన్నాం. సినిమాను ప్రాణం పెట్టి తీశాం. జూలై 7న ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌లో భాగ్ సాలే మూవీని చూడండి అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular