Saturday, June 13, 2026
Homeసినిమాక్రైమ్ థ్రిల్లర్ జోనర్ తో టెన్షన్ పెట్టనున్న శ్రీవిష్ణు!

క్రైమ్ థ్రిల్లర్ జోనర్ తో టెన్షన్ పెట్టనున్న శ్రీవిష్ణు!

శ్రీవిష్ణు నిదానంగా దార్లో పడిపోయాడు. కెరియర్ ఆరంభంలో ఎలాంటి కథలను ఎంచుకోవాలో .. ఎలాంటి పాత్రలను సెట్ చేసుకోవాలో తెలియని అయోమయానికి లోనయ్యాడు. ఏ జోనర్ తనకి ఎక్కువ సెట్ అవుతుందనే విషయంలో అతనికి క్లారిటీ రావడానికి కొంత సమయం పట్టింది. తన నుంచి కామెడీనీ ఆడియన్స్ ఎక్కువగా కోరుకుంటున్నారనే విషయం ఈ మధ్యనే ఆయనకి అర్థమైంది. అప్పటి నుంచి వరుస హిట్లను అందుకుంటూ ముందుకు వెళుతున్నాడు.

కామెడీ పాళ్లు ఎక్కువగా ఉన్న కంటెంట్ తో శ్రీవిష్ణు చేసిన ‘రాజ రాజ చోర’ .. ‘సామజవరగమన’ సినిమాలు అతనికి భారీ విజయాలను అందించాయి. హీరోగా కామెడీ టచ్ ఉన్న పాత్రలలో మెప్పించే బాడీ లాంగ్వేజ్ శ్రీవిష్ణుకి ఉందనే విషయాన్ని ఈ సినిమాలు చాటిచెప్పాయి. ఇదే సమయంలో వచ్చిన ‘ఓం భీమ్ బుష్’ సినిమా కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది. హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా, మంచి వసూళ్లతో థియేటర్స్ లో సందడి చేస్తోంది.

ఈ నేపథ్యంలో శ్రీవిష్ణు నుంచి నెక్స్ట్ మూవీగా ఏది రానున్నదనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సారి ఆయన క్రైమ్ థ్రిల్లర్ జోనర్ తో పలకరించనున్నట్టుగా తెలుస్తోంది. సందీప్ గుణ్ణం – వినయ్ చిలకపాటి నిర్మాతలుగా హుస్సేన్ షా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ  సినిమా 60 శాతం చిత్రీకరణను జరుపుకుందని అంటున్నారు. శ్రీవిష్ణు జోడిగా ‘సామజవరగమన’ బ్యూటీ రెబా మోనికా జాన్ కనిపించనుంది. క్రైమ్ థ్రిల్లర్ అయినా కామెడీ టచ్ ఉంటుందనీ, శ్రీవిష్ణు టెన్షన్ పెడుతూనే నవ్విస్తాడని అంటున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా కూడా థియేటర్లకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular