Friday, March 20, 2026
Homeసినిమాఇన్నోవేటివ్ గా ‘తురుమ్ ఖాన్‌లు’ పోస్టర్

ఇన్నోవేటివ్ గా ‘తురుమ్ ఖాన్‌లు’ పోస్టర్

Turum Khanlu Motion Poster :

కెకె సినిమాస్ పతాకం పై శివకళ్యాణ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.కళ్యాణ్ రావు నిర్మిస్తున్న చిత్రం తురుమ్ ఖాన్‌లు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో టామ్ అండ్ జెర్రీ లాంటి పాత్రలతో డార్క్ హ్యూమర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో 50 మందికి పైగా నూతన, థియేటర్ ఆర్టిస్టులు నటించారు. హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా “తురుమ్ ఖాన్‌లు” టైటిల్  ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది.

ఈ సందర్భంగా  డైరెక్టర్ శివకళ్యాణ్ మాట్లాడుతూ “బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు ఒకే ఊరిలో పుట్టి  గొడవపడుతూ లలిత, భారతి, పద్మలని చేరుకునేందుకు ఆరాటపడుతుంటే అక్కడే పుట్టిన శ్రీకృష్ణుడు ఆ చిక్కుముడిని ఎలా విప్పాడనేదే ఈ చిత్ర కథ. మా తురుమ్ ఖాన్‌లు , డార్క్ హ్యూమర్ జానర్ లో రూపొందింది. ఈ చిత్రం అందరిని అలరిస్తుంది. పోస్టర్ విడుదల చేసిన శ్రీ విష్ణు గారికి థాంక్స్ అని అన్నారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. “తురుమ్ ఖాన్‌లు పోస్టర్ ఐడియా ఇన్నోవేటివ్ గా ఉంది. డైరెక్టర్ శివకళ్యాణ్ నాకు ఐదేళ్ళ నుంచి తెలుసు. నా సినిమాలకు వర్క్ చేశాడు. నేనే తనతో సినిమా చేయాల్సింది కుదరలేదు. తన రైటింగ్ అన్నా, తన కామెడీ అన్నా నాకు చాలా ఇష్టం. తురుమ్ ఖాన్‌లు సినిమాతో ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా నిలబడతాడని ఖచ్చితంగా చెప్పగలను. టీం అందరికీ, ముఖ్యంగా ప్రొడ్యూసర్ కి బెస్ట్ విషెస్”అన్నారు.

Also Read : ఇంకా మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను : అమృతా అయ్యర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular