8.8 C
New York
Sunday, December 10, 2023

Buy now

HomeసినిమాDisney Hotstar: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'శ్రీదేవి శోభన్ బాబు' 

Disney Hotstar: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ‘శ్రీదేవి శోభన్ బాబు’ 

సంతోష్ శోభన్ – గౌరీ కిషన్ జంటగా నటించిన సినిమానే ‘శ్రీదేవి – శోభన్ బాబు’. చిరంజీవి పెద్ద  కూతురు సుస్మిత ఈ సినిమాకి నిర్మతగా వ్యవహరించింది. అంతవరకూ సొంత బ్యానర్ పై వెబ్ సిరీస్ లు చేస్తూ వచ్చిన ఆమె, తన బ్యానర్లో చేసిన ఫస్టు సినిమా ఇది. ప్రశాంత్ కుమార్ దిమ్మల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాకి కమ్రాన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఫ్యామిలీ డ్రామా జోనర్లో ఈ సినిమా రూపొందింది.

ఈ ఏడాదిలో ఫిబ్రవరి 18వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. హీరో తండ్రి .. హీరోయిన్ తల్లి సొంత అన్నాచెల్లెళ్లు. ఎంతో అనురాగంతో ఉండే వారిద్దరూ కొన్ని కారణాల వలన దూరమవుతారు. రెండు కుటుంబాల మధ్య మాటలు ఉండవు. అలా చాలా కాలం గడిచిపోతుంది. వారి ఇద్దరి పిల్లలు యవ్వనంలోకి అడుగుపెడతారు. కొన్ని కారణాల వలన హీరో ఇంట్లో హీరోయిన్ కొన్ని రోజుల పాటు గడపాల్సి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? అనే కథతో ఈ సినిమా నడుస్తుంది.

సంతోష్ శోభన్ .. గౌరీ కిషన్ ఇద్దరూ కూడా బాగా చేశారు. హీరో తల్లిగా రోహిణి .. హీరోయిన్ తండ్రిగా నాగబాబు సహజంగా నటించారు. అయితే వచ్చిన చిక్కంతా కథతోనే. లవ్ .. కామెడీ .. ఎమోషన్ ప్రధానంగా నడిచే ఈ కథ రొటీన్ గా ఉండటం వలన, థియేటర్స్ నుంచి రెస్పాన్స్ ను రాబట్టలేకపోయింది. అలాంటి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్