Sunday, January 19, 2025
Homeసినిమా‘శ్రీదేవి సోడా సెంటర్' రికార్డ్

‘శ్రీదేవి సోడా సెంటర్’ రికార్డ్

సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా విమర్శకులను మెప్పించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీపావళి కానుకగా జీ 5 ఓటీటీలో ఈ సినిమా విడుదలై వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పరువు కోసం ఓ కన్నతండ్రి ఎంత దారుణానికి ఒడిగట్టారు ? తన కులం కాని అమ్మాయిని ప్రేమించిన హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది సినిమాలో చాలా హృద్యంగా చూపించారు. పరువు హత్యల నేపథ్యంలో తెలుగులో వచ్చిన గొప్ప సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’ అని విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసించారు.

‘జీ 5’ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఈ సినిమా గురించి తెలిసేలా మార్కెటింగ్ చేసింది. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రమోట్ చేసింది. ఓటీటీలో విడుదలైన తర్వాత సక్సెస్ మీట్ నిర్వహించింది. అక్కడ సుధీర్ బాబు, ఇతర తారలతో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. ఈ సినిమా ఎంత సక్సెస్ సాధించింది అంటే… జీ 5లో విడుదలైన 7 రోజుల్లో 50 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా సినిమా బృందానికి కంగ్రాట్స్ చెబుతూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పోస్టర్ విడుదల చేశారు.

భారతదేశంలో నంబర్ 1 ఓటీటీ ‘జీ 5’లో తమ సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’ విడుదల కావడం, ఇంత ఘన విజయం సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చిత్రబృందం తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్