Friday, March 29, 2024
Homeసినిమా‘శ్రీదేవి సోడా సెంటర్’ విడుదల తేదీ ఖరారు

‘శ్రీదేవి సోడా సెంటర్’ విడుదల తేదీ ఖరారు

యంగ్ హీరో సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఈ చిత్రానికి పలాస ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 70mm ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేసింది చిత్ర బృందం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌గా రూపొందిన ఈ మూవీ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు ఏర్పడ్దాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్ కు అనూహ్యమైన స్పందన లభించింది.

అలాగే.. నాలో ఇన్నాళ్లుగా కనిపించని.. అంటూ సాగే డ్యూయెట్ ఇటీవల విడుదల చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం ఈ పాటను మరో స్థాయికి చేర్చింది. ఇలా సినిమాపై పాజిటివ్ టాక్ ఏర్పరుచుకున్న ఈ సినిమాను ఆగస్టు 27న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో విడుదల తేదీతో ఉన్న ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. సుధీర్ బాబు, ఆనంది తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్యానర్: 70mm ఎంటర్టైన్మెంట్స్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ దత్ సైనుద్దీన్, సంగీతం: మణిశర్మ, పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్, నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి, దర్శకత్వం: కరుణకుమార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్