ప్రభుత్వం జి ఓ నంబర్ 13 ను వెంటనే వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ౩౦ వేల ఎకరాలను అమ్మాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆరోపించారు. ఆస్తులను కాపాడుకునేందుకే నాడు సోనియా గాంధీ తెలంగాణా రాష్ట్రం ఇచ్చారని, కానీ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా భూములను తెలంగాణేతరులకు విక్రయించాలని చూడడం అనైతికమని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు భూములు పంచితే ఇప్పుడు భూములు పెద్దలకు అమ్మడం అన్యాయమని పేర్కొన్నారు. తమ హయాంలో పోడు భూములు కూడా పంచామని గుర్తు చేశారు.
పిసిసి అధ్యక్ష పదవి రేసులో లేనని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు అంగీకారమేనని వెల్లడించారు. అందరం కలిసి పనిచేసి రాబోయే ఎన్నికల్లో పార్టీకి పునర్వైభవం తీసుకు వచ్చేందుకు కృషిచేస్తామన్నారు. ఈటెల రాజేందర్ బిజెపిలో చేరడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని. బిజెపి-టిఆర్ ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.